కొమర్రాజు భరద్వాజ్ శర్మ M.a,Phd In Astrology
శోభకృతా నామ సంవత్సర ఫలము:2023 2024
ఈ సం॥రం రాజు బుధుడు , రసాధిపతి బుధుడు. మంత్రి శుక్రుడు. సేనాధిపతి, మేఘాధిపతి, అర్హదిపతి -గురుడు.
సస్యాధిపతి, నీరసాధిపతి చంద్రుడు. ధాన్యాధిపతి శని.
ఈ నవనాయకులలో 8 ఆధిపత్యములు శుభులకు. 1. ఆధిపత్యం పాపులకు వచ్చుటచే దేశ పరిస్థితులు బాగుండును. పరిపాలన ప్రజారంజకంగాసాగును. ప్రపంచమంతా ఆర్ధికమాంధ్యం ఉన్ననూ మన దేశపరిస్థితి బాగుంటుంది. వృద్ధిశాతం పెరుగును. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ప్రజా సంక్షేమ పధకాలు కేంద్రరాష్ట్రాలు పోటా పోటీగా అమలు చేయును.ప్రజల యొక్క మన్ననలు పొందుదురు. కేంద్ర ప్రతిపక్షం వారు ఎంత విమర్శించినప్పటికీ ప్రజలు పాలక పక్షం వైపే ఉంటారు. ఈ సంవత్సరం సరిహద్దు దేశాలతో తగాదాలు తప్పవు. కొన్నిచోట్ల అరాచక శక్తులు అల్లర్లు సృష్టించెదరు. ప్రభుత్వం ముందుగా పసిగట్టి అణచి వేయుదురు. భారతదేశఖ్యాతి పెరుగును. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమగును. క్రీడారంగంలో అనేక విజయాలు లభించును. ద్రవ్యోల్బణం తగ్గును. పారిశ్రామిక రంగం వృద్ధిలో ఉండును. పర్యాటకరంగం కూడా బాగుండును. ఈ సం॥రం 3 కుంచములు వర్షం గాన దేశమంతటా మంచి వర్షములు కురిసి సగటు వర్షపాతం కంటే ఎక్కువగా నమోదగును. ఉత్తర భారతం, దక్షిణ భారతదేశములోని నదులన్ని పొంగి ప్రవహించును. కొన్ని చోట్ల ప్రమాదసూచికలు దాటి ప్రవహించును. పడవ ప్రమాదములు అధికమే. ఈ సం॥రం కూడా వడగండ్లు పిడుగులు పడుట కూడా ఎక్కువగానే ఉండును. తూర్పు, ఈశాన్య రాష్ట్రములకు అధికనష్టం కలుగును. మెట్ట, పల్లపుభూములు సమానముగా ఫలించును. పర్వత ప్రాంతమందు కొండచరియలు విరిగి జననష్టం కలుగును. వరి, గోధుమ, చెరకు, తృణ ధాన్యములు, మిర్చి, ప్రత్తి, సుగంధద్రవ్యములు, పసుపు, మొక్కజొన్న, అరటి, కొబ్బరిలకు మంచిధరలు ఉంటాయి.
ఈ సం॥రం మిర్చి, ప్రత్తి, పంటలకు నూతన తెగుల్లు వల్ల దిగుబడి బాగా తగ్గును. రైతులు యోచించి మసలుకోవలెను. కాఫీ, టీ తోటలు బాగా ఫలించును.నల్లరేగడి, గరువుభూములందు ఫలించును. ఔషధ మొక్కలు, వాణిజ్యపంటలకు మంచి దిగుబడి వచ్చును. చింతపండు, కుంకుళ్ళు, పసుపులకు ధరలు బాగుండును. రైతులకు ప్రభుత్వం వారు అనేక నూతన పథకాలు ప్రవేశపెట్టెదురు. ఈ సం॥రం కూడా ప్రకృతి వైపరీత్యములు అధికమే. నష్టం తక్కువగా ఉండును. మహానగరాలు నీట మునుగును, ప్రజా జీవనం స్థంభించును. తీర ప్రాంత గ్రామాలు ముంపునకు గురి అగును. రాజకీయంగా నూతన కూటములు ఏర్పడును. రెండు తెలుగు రాష్ట్రములందు జలాశయాలు పూర్తిగా నిండును. ఆహారధాన్యాలు ఉత్పత్తి బాగా పెరుగును. విదేశాలకు ఎగుమతులు చేయుదురు.
పశుపాలకుడు – బల రాముడు, విడిపించువాడు యముడు అగుటచే పాడిపరిశ్రమ బాగుండును. నూతన డైయిరీలు నెలకొల్పుదురు. పాలధరలు పెరుగును. పశువులు ధరలు పెరుగును. రైతులు ఈ సం॥రం ఆనందంతో, సుఖసంతోషాదులతో ఉంటారు.
ఈసం॥రంకూడా వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదగును. కొన్నిచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదగును. ఉభయ తెలుగు రాష్ట్రములందు వేసవి తాపం ఎక్కువ. వడగాడ్పులు వీచును. అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు అధికమే. ఆస్తినష్టం వర్షాలు కురియుట, మామిడి మొదలగు పండ్లతోటలకు నష్టము కలిగి దిగుబడి తగ్గును. జననష్టం అధికం. వేసవిలోనే తొలకరి వానలు ప్రారంభమగును. ఈ సంవత్సరం అక్టోబర్ 28 వరకు మేషరాశిలో గురు, రాహువుల కలయిక, ప్రబల దేశరిష్టయోగం.ప్రపంచమంతటా నష్టములు కలుగును. ఊహకు అందని సంఘటనలు జరుగును.గతంలో 1892 సంవత్సరంలో వచ్చినది. అనేక విపత్తులు ఏర్పడును. యుద్ధ వాతావరణం ఉంటుంది. అగ్రదేశాలు అతలాకుతలమగును. ప్రముఖులు, ప్రఖ్యాతి వ్యక్తులకు అరిష్టం. అనేక విచిత్రమైన సంఘటనలు జరుగును.ఈ యోగం గతంలో 1892 సం॥లో వచ్చింది. తుఫాను ప్రమాదముల అధికం.తెలoగాణ రాష్టం లో బిజెపి బాగా బలపడుతుంది.ఆంధ్ర రాష్ట్రము లో కొత్త పార్టీ మరింత బల పడుతుంది.ఉద్యోగ పోరాటాలు అదికం అగును.
మౌఢ్య దినములు
కర్తరి నిర్ణయం :- 5-5-2023 వైశాఖ శుక్లపూర్ణిమ శుక్రవారం నుండి చిన్నకర్తరి
11-5-2023 వైశాఖ బహుళ షష్ఠి గురువారంనుండి పెద్ద(నిజ) కర్తరి.
ఈ సమయాన కర్ర, మట్టిపనులు చేయరాదు. చిన్నకర్తరిలో కొన్ని పనులు చేయవచ్చును. పెద్ద కర్తరిలో గృహసంబంధమైన కర్రమట్టి పనులు చేయరాదు. (శ్లాబులు వేసుకోవచ్చును.)
గురుమూఢమి :- 1-4-2023 చైత్ర శుక్లఏకాదశి శనివారం నుండి 2-5-2023 వైశాఖ శుక్ల ద్వాదశి మంగళవారం వరకు
శుక్రమూఢమి :-08-08-2023 అధిక శ్రావణ బహుళ సప్తమి మంగళ వారం నుండి
17-8-2023 నిజ శ్రావణ శుక్లపాడ్యమి గురువారం వరకు.
గురు శుక్ర మూఢమి లలో శుభాకార్యక్రమాలు వుండవు
పుష్కరనిర్ణయం :- ది. 23-4-2023 వైశాఖ శుక్ల తృతీయ ఆదివారం గురుడు మేషరాశిలో ప్రవేశించును. గంగా నదికి పుష్కరములు జరుగును.,
మకరసంక్రాంతి పురుష పుణ్యకాలం
సంక్రాంతి పురుషుడు: ద్వా౦క్ష నామధేయం గుఱ్ఱం వాహనం
శ్రీ శోభాకృత్ నామ సంవత్సరం పుష్య శుక్ల చవితి సోమవారం, శతభిషా నక్షత్రం, వరియా యోగం, భద్ర కరణం, మకర లగ్నం శుభ సమయాన ది. 15.1.2024 తేదీ ఉ.8.18 ని॥లకు సూర్యుడు మకరరాశిలో ప్రవేశించును. సంక్రాంతి ఉదయం నుండి సాయంత్రం 4.00 వరకు పుణ్యకాలం.
ఈ సంవత్సరం భూమండలం ప్రపంచంలో 4 గ్రహణములు ఏర్పడుచున్నవి.2 సూర్య గ్రహణములు, 2 చంద్ర గ్రహణములు
అందులో ఒక్క చంద్రగ్రహణము మాత్రమే భారతదేశమందు కనిపించును.
మిగిలిన గ్రహణములు భారతదేశమందు ఎక్కడా కన్పించవు. మనకు కన్పించని గ్రహణములకు ఏవిధమైన నియమాలు పాటించనవసరం లేదు.
1. సంపూర్ణ సూర్యగ్రహణము : (భారతదేశంలో ఎక్కడా కన్పించదు)
శ్రీశోభకృత్నామ సంవత్సరం చైత్రబహుళ అమావాస్య గురు వారం 20-4-2023 తేది రాహుగ్రస్తసంపూర్ణ సూర్యగ్రహణం. ఈగ్రహణంతూర్పుఆసియా, దక్షిణ ఆసియా , ఫసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా సముద్రాలందు కన్నించును. ఇండోనేషియాలోని జకర్తా, మకాసార, మనక్వాలీ లందు, ఫిలిఫ్పైన్స్ ని జనరల్ సాంటీష్, దావో, ఆస్ట్రేలియాలోని డార్విన్ ప్రాంతాలందు కన్పించును. (భారతదేశంలో ఎక్కడా కన్పించదు)
2. కంకణాకార సూర్య గ్రహణము : (భారతదేశంలో ఎక్కడా కన్పించదు)"
శ్రీ శోభకృత్ నామ సం॥ర భాద్రపద బహుళ అమావాస్య శనివారం 14-10-2023 తేది కేతు గ్రస్త కంకణాకార సూర్య గ్రహణం. ఈ గ్రహణం పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఫసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహా సముద్రములందు కన్పించును. అమెరికా (న్యూమెక్సికో, టెక్సాస్, మెక్సికో, బీరైజ్, ఫనామా, కొలంబియా, బ్రెజిల్, లోని లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా, క్యూభా, .సాల్విడార్, జమైకా, ఈక్వడార్, వెనిజులా, దేశములందు కన్పించును. (భారతదేశంలో ఎక్కడా కన్పించదు)
3. పాక్షిక చంద్రగ్రహణము : శ్రీశోభకృత్ నామ సం॥ర ఆశ్వీయుజ శుక్ల పూర్ణిమ శనివారం
ది.28-10-2023 తేది రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం (భారతదేశమంతా కన్పించును.) ఈ గ్రహణం మన దేశమునందే గాక బెల్జియం, థాయ్లాండ్, పోర్చుగల్, హంగేరి, ఈజిప్టు, టర్కీ, ఇండోనేషియా, గ్రీసు ఇటలీ, మయన్మార్, స్పెయిన్, ఇంగ్లాడ్,దక్షిణఆఫ్రికా, పారీస్, నైజీరియా,జపాన్, చైనా, రష్యాదేశములందు కన్పించును.
రాజమండ్రి స్పర్శకాలం రాత్రి గం. 1.04 ని॥లు
రాజమండ్రి మధ్యకాలం రాత్రి గం. 1.43 ని॥లు
రాజమండ్రి మోక్షకాలం రాత్రి గం. 2.23 ని॥లు
గ్రహణం పుణ్యకాలం గం. 1.19 ని॥లు
ఈ గ్రహణం అశ్వనినక్షత్రం మేషరాశిలో పట్టు చున్నందున, అశ్విని నక్షత్ర జాతకులు, మేష రాశివారు ఈ గ్రహణం చూడరాదు, శాంతి చేసుకోవాలి.
నిత్యభోజన ప్రత్యాబ్దిక నిర్ణయం : అర్ధరాత్రి తర్వాత గ్రహణం కావున యధావిధిగా ఆబ్దికములు చేసుకోవచ్చును.
4. సంపూర్ణ సూర్యగ్రహణము : శ్రీశోభకృత్ నామసం॥రం ఫాల్గుణ బహుళ సోమవారం ది. 8-4-2024 తేది రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణము.( భారతదేశములో ఎక్కడా కన్పించదు నియమాలు పాటించక్కర్లేదు)